మనోళ్ల చాయ్ పానీకి అమెరికా ఫిదా..
భారత సంప్రదాయ వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. భారతీయ చిరుతిండ్లకు ప్రసిద్దికెక్కిన చాయ్ పానీ రెస్టారెంట్ అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. మన ఇండియన్స్ ఏర్పాటు చేసిన చాయ్పానీ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ ఉత్తమ రెస్టారెంటుగా ఎంపికైంది. చికాగోలోని జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను చాయ్ పానీని ఎంపిక చేసింది. నార్త్ కరోలినాలోని అష్విల్లేలో ఉన్న ఈ రెస్టారెంటు అందరికీ సుపరిచితమే. ఇక్కడ దొరికే చాట్ చాలా ఫేమస్. పైగా ఇక్కడ ధరలు కూడా వేరే రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయని చెబుతుంటారు.













