కరోలినా వోజ్నియాకి మళ్లీ వస్తోంది
మహిళల సింగిల్స్ మాజీ నంబర్ వన్ డెన్మార్క్ టెన్నిస్ తార కరోలినా వోజ్నియాకి మళ్లీ కోర్టు బాట పట్టింది. రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల విరామం తర్వాత ఆమె ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో (ఆగస్టు 28` సెప్టెంబర్ 10) బరిలో దిగబోతోంది. ఈ టోర్నీలో ఆడేలా ఆమెకు వైల్డ్ కార్డు ఇస్తామని యుఎస్ టెన్నిస్ సంఘం ప్రకటించింది. కుటుంబం కోసం మూడేళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా, ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిని. కానీ ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు మిగిలున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కలలను నెరవేర్చుకోవచ్చని నా పిల్లలకు చూపించాలాని అనుకుంటున్నా అని వోజ్నియాకి తెలిపింది. 2006లో అరంగేట్రం చేసి చివరిగా 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన 32 ఏళ్ల వోజ్నియాకి, కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ (2018, ఆస్ట్రేలియన్ ఓపెన్ )మాత్రమే గెలిచింది. ఎన్బీఏ ఆటగాడు డేవిడ్ లీని పెళ్లాని కరోలినాకు రెండేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు.













