తప్పైపోయింది…క్షమించండి : కార్డి బి
దుర్గామాత వేషంలో పాద రక్షలు పట్టుకుంటూ ఓ మ్యాగజైన్ కవర్పేజీకి ఫోజులిచ్చిన 28 ఏళ్ల అమెరికన్ ర్యాపర్ కార్డి బి క్షమాపణ చెప్పారు. తన వల్ల పొరపాటు జరిగిందని.. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. ఈ ముఖచిత్రాన్ని పాదరక్షల మ్యాగజైన్ ప్రచురించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవతను అవమానించడంపై మండిపడ్డారు. దీంతో కార్డి బి క్షమాపణ చెబుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఫోటో షూట్ చేసినపుడు దుర్గామాతలా ఉంటానని ఆమె శక్తికి, విముక్తికి ప్రతీక అని చెప్పారు. ఏ మాతాన్ని కించపరచాలన్ని ఉద్దేశం నాకు లేదు. నా మతానికి ఇంకొకరు ఇలా చేసినా నాకు నచ్చదు. అగౌరవ వపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. గతాన్ని మార్చలేను. భవిష్యత్తులో ఇలాంటివి చేసేటపుడు జాగ్రత్తలు తీసుకుంటా అని వీడియో సందేశంలో కార్డి బి పేర్కొన్నారు.













