తెలుగు అమ్మాయి అరుదైన ఘనత
హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి చైతన్య పోలోజు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021లో రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కించుకుంది. అంజలి పౌఘట్డిజైనర్ డ్రీం కలెక్షన్ ధరించి, రెడ్‌కార్పెట్‌పై నడిచి అందరిదృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌కు చెందిన చైతన్య వృత్తి రీత్యా అమెరికాలోని వర్జీనియా నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, గృహిణిగా బాధ్యతలను నిర్వహిస్తూనే నటిగా, మోడల్‌గా, కనెక్ట్ హోప్‌కు ఫౌండర్‌గా, మోటివేషనల్ స్పీకర్ ఉంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్ రెడ్‌కార్పెట్‌పై నడవటం నా జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకోవటానికి శ్రమించాలని, పది మందికి సేవ చేయాలనే గుణాన్ని అలవర్చు కోవాలని కోరారు. చైతన్య మిసెస్ భారత్ న్యూయార్క్ 2019 విజేతగా, మిసెస్ భారత్ అమెరికా రన్నర్ ఆఫ్‌గా మిసెస్ తానా డీసీ 2019 రన్నర్ అప్‌గా, మిసెస్ టాలెంటెడ్ 2019 లాంటి ప్రతిష్టాత్మక కిరీటాలను అందుకుంది.













