కాలిఫోర్నియాలో అత్యయిక పరిస్థితి… రానున్న 24 గంటల్లో
అమెరికాలోని కాలిఫోర్నియాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నదులు ఉప్పొంగుతున్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. అత్యయిక స్థితిని ప్రకటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కోటీ 50 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. వహారో నదిపై లవీ వంతెన తెగిపోవడంతో శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తుతోంది. రానునÊ 24 గంటల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.













