కాలిఫోర్నియాకు వాతావరణ శాఖ హెచ్చరిక
ఇప్పటికే హిమపాతంతో సతమతం అవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాకు అతి భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాలకు తోడు మంచు కరగడంతో వరద ముంచెత్తే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఉత్తర, మద్య ప్రాంతాల్లోని కోటీ 70 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడనుంది. రాజధాని శాక్రమెంటోతో పాటు శాన్ఫ్రాన్సిస్కో, బే ఏరియాలకు వరద తాకిడి తగలనుంది. ముందుజాత్త్రగా రెండు వారాలకు సరిపడ్డా సరుకులు, వరదను అడ్డుకునేందుకు ఇసుక బస్తాను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.













