అక్కడ మాస్క్ ధరిస్తే… జరిమానా!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి అయింది. ఈ సమయంలో మాస్క్ ధరించని వారికి పోలీసులు జరిమానా విధించడమూ చూస్తూనే ఉన్నాం. అయితే ఓ కేఫ్‍లో మాత్రం మాస్క్ ధరిస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఎక్కడనుకుంటున్నారా? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‍హెడ్ కేఫ్‍లో మాస్క్ ధరిస్తే ఐదు డాలర్ల జరిమానా విధిస్తున్నారు. ముందుగా ఆ కేఫ్ యజమాని కస్టమర్లకు గమనికగా.. గోడలపై పెద్ద పెద్ద అక్షరాలతో మాస్క్ ధరించి ఆర్డర్ చేస్తే వారికి ఐదు డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా చెప్పుకుంటే అదనంగా మరో ఐదు డాలర్లు పైన్ విధించబడును అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి చూపించి మరీ కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్నారట. ఆ యజమాని అసలెందుకు అలా ఫైన్ విధిస్తున్నారంటే.. ఓ స్వచ్ఛంద సంస్థ కోసం ఆయన ఇలా చేస్తున్నారట. ఇది తెలిసి కస్టమర్లు కూడా పోటీ పడి మరీ ఫైన్లు చెల్లిస్తున్నారట.