కాలిఫోర్నియాలో బీభత్సం..కొత్త సంవత్సరం ఆరంభంలోనే
అమెరికాలోని కాలిఫోర్నియా నగరాన్ని తుపాన్ కుదిపేసింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే విషాదాన్ని నింపింది. తుఫాన్ ధాటికి ఇద్దరు మరణించారు. వేలాది ఇళ్లకు కరెంట్ సరఫరా స్తంభించింది. పసిఫిక్ మహాసముద్రం నుంచి తేమతో కూడిన వాతావరణం కారణంగా తుఫాను ఏర్పడింది. భారీగా వానలు కురుస్తున్నాయి. మరోవైపు మంచు కూడా ముంచెత్తింది. ఉత్తర, మధ్య కాలిఫోర్నియాలో వరదలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. శాక్రమెంటోలో వరద నీటిలో మునిగిపోయిన వాహనంలో లోపల డ్రైవర్, శాంటాక్రూజ్లోని లైట్హౌస్ ఫీల్డ్ స్టేట్ బీచ్ వద్ద పడిపోయిన చెట్టు కారణంగా 72 ఏళ్ల వ్యక్తి మరణించారు. కాలిఫోర్నియా ఎత్తైన ప్రాంతాలలో గత వారంలో 14 ఇంచుల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. వరదల కారణంగా హైవే 99, హైవే 50తో పాటు పలు రోడ్లను అధికారులు మూసి వేశారు. పశ్చిమ నెవాడాలో దాదాపు 30 వేల మంది చీకటల్లోనే ఉండిపోయారు.













