బ్రిట్నీ రహస్యాల కోసం రూ.112 కోట్లు..
ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీకి స్పియర్స్ తో ఓ పుస్తక ప్రచురణ సంస్థ భారీ డీల్ కుదుర్చుకుంది. ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు పుస్తక రూపంలో వెలుగులోకి తీసుకురావడం కోసం ఆమెకు 15 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు 112 కోట్ల రూపాయలు) అప్పజెప్పేందుకు అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ ముందుకు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో ఆమెకు ఇవ్వడానికి కారణం ఏంటటే.. తన జీవితంలో చోటు చేసుకున్న కన్సర్వేటర్షిప్ గురించి అంతా బయట పెట్టేందుకు బ్రిట్నీ అంగీకరించడమే. ఈ పబ్లిషింగ్ హౌస్ విడుదల చేయబోయే బుక్లో బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ సంరక్షణలో తాను అనుభవించిన 13 ఏళ్ల నరకప్రాయమైన జీవితం గురించి అనేక రహస్యాలుంటాయట.
ప్రస్తుతం బ్రిట్నీ స్వతంత్రంగా జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఆమె కన్సర్వేటర్షిప్లో ఉన్న సమయంలో పడిన ఇబ్బందులను, తండ్రికి సంబంధించిన కొన్ని రహస్యాలను పుస్తక రూపంలో ప్రచురించేందుకు పలు ప్రచురణ సంస్థలు పోటీ పడినప్పటికీ అమెరికాలోని ఓ పబ్లిషింగ్ కంపెనీ రికార్డు స్థాయిలో రూ.112 కోట్లు అప్ప జెప్పి పుస్తకం హక్కులు కొనుగోలు చేసింది. ఇంత భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్న బ్రిట్నీ ఎలాంటి రహస్యాలను బయటపెడుతుంతో చూడాలి.













