బోరిస్ జాన్సన్‌తో గౌతమ్ అదానీ భేటీ
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. భారత పర్యటనలో భాగంగా జాన్సన్ అహ్మదాబాద్ నగర శివారులోని శాంతిగ్రామ్‌లో ఉన్న అదానీ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలురంగాల్లో యూకే కంపెనీలతో కలిసి పనిచేసే అంశాలపై బ్రిటన్ ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ గుజరాత్లో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. పునరుద్పాదకత, గ్రీన్ హైడ్రోజన్, నూతనశక్తి పనులపై దృష్టి సారిస్తున్నామన్నారు. రక్షణ, ఏరోస్పేస్ సాంకేతికత లో యూకే కంపెనీలతో కలసి పనిచేస్తామని అదానీ తెలిపపారు.













