భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన పురస్కారం

భారత సంతతికి చెందిన బ్రిటీష్ శాస్త్రవేత్త, కేంబ్రిడ్జ్ వర్సిటీ ప్రొఫెసర్ సర్ శంకర్ బాలసుబ్రమణ్యన్‍కు అరుదైన పురస్కారం లభించింది. టెక్ నోబెల్‍గా పేరొందిన 2020 మిలీనియమ్ టెక్నాలజీ పురస్కారానికి బాలసుబ్రమణ్యన్, సహ శాస్త్రవేత్త డేవిడ్ క్లెనెర్‍మన్ ఎంపికయ్యారు. డీఎన్‍ఏ జన్యుక్రమాన్ని వేగంగా, కచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో విశ్లేషించే సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ పురస్కారం దక్కింది.