రష్యా దాడులను తిప్పికొట్టడానికి.. అత్యాధునిక రాకెట్లిస్తాం
రష్యా పోరులో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అత్యాధునిక మధ్య శ్రేణి ఎం270 లాంచర్ రాకెట్ సిస్టమ్స్ అందజేస్తామని ఇంగ్లండ్ ప్రకటించింది. 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే రాకెట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. రష్యా వైమానికి దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తామని అమెరికా, జర్మనీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ ఆయుధాలు అందేలోపే డోన్బాస్ను రష్యా పూర్తిగా ఆక్రమించుకోనేలా కనిపిస్తోదని సైనిక నిపుణులంటున్నారు. అమెరికా ఆయుధాలు, సైనిక శిక్షకులు రావడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తామని స్వీడన్ కూడా ప్రకటించింది. యాంటీ షిప్ క్షిపణులు, రైఫిళ్లు యాంటీ ట్యాంకు ఆయుధాలు సరఫరా చేస్తామంది.













