బ్రిక్స్ చరిత్రలో మరో అడుగు..
బ్రిక్స్ కూటమిన విస్తరించాలన్న భారత ప్రతిపాదన ఫలించింది. భాగస్వామ్య దేశాల ఏకాభిప్రాయంతో అర్జెంటీనా,ఇరాన్, సౌదీ అరేబియా,ఈజిప్టు, యూఏఈ బ్రిక్స్ కూటమిలో చేరాయి. ఈవిషయాన్ని బ్రిక్స్ అధికారికంగా ప్రకటించింది. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈకూటమిని విస్తరించడం ద్వారా.. మరింత బలోపేతం చేయవచ్చని భారత్ వాదిస్తూ వస్తోంది. మరిన్ని దేశాలు ఇందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. కూటమి విస్తరణ ద్వారా ఈ దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందుతుంది. దీనికి తోడు వివిధ అంశాలను.. ఈవేదికపై చర్చించేందుకు అవకాశం లభిస్తుంది.













