బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా డా సిల్వా
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (77) ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సొనారోపై స్వల్ప తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం 98.8 శాతం ఓట్లలో డా సిల్వాకు 50.9 శాతం, బోల్సొనారోకు 49.1 శాతం ఓట్లు లభించినట్టు బ్రెజిల్ ఎన్నికల సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1న డా సిల్వా బ్రెజిల్ తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రెజిల్లో నానాటికీ మితిమీరిపోతున్న నేరాలను అరికట్టి శాంతిని నెలకొల్పడం డా సిల్వా ముందున్న అతిపెద్ద సవాలని విశేష్లకులు చెప్తున్నారు.













