బ్రిటన్ ప్రధాని రహస్యంగా పెళ్లి..

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు కారీ సైమండ్స్ ను (33) వివాహం చేసుకున్నారని ప్రధాని అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించారు. శనివారం జరిగిన ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు హాజరైనట్టు వెల్లడించింది. బోరిస, సైమండ్స్ 2019 నుంచి డౌనింగ్ స్ట్రీట్‍లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి గతేడాది నిశ్చితార్ధం జరిగింది. ఏడాది క్రితం వీరికి ఒక బాబు పుట్టాడు. కాగా గతంలో బోరిస్‍కు రెండు పెండ్లిక్లు జరిగాయి. వారితో ఆయన విడిపోయారు.