ఈజిప్టు పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి

అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ ఈజిప్టుకు చేరుకున్నారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలోపేతం చేస్తామంటూ ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, పాలస్తీనా అథారిటీ అధ్యక్షులు మహమూద్ అబ్బాస్‍తో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. గాజా పునర్మిర్మాణానికి అమెరికా సహాయం చేస్తుందని బ్లింకెన్ హామీ ఇచ్చారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ ప్రజలు భద్రత, రక్షణతో జీవించడానికి సమానమైన అర్హులని బలంగా నమ్ముతున్నాం అని బ్లింకెన్ తెలిపారు. ఈ పక్రియకు ఈజిప్టు చాలా ముఖ్యమైనదని అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ మద్య చర్చలకు ఈజిప్టు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.