అమెరికాలో ఘోరం.. ఇంటి డోర్ బెల్ మోగించాడని
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తన ఇంటి డోర్‌ను రెండు సార్లు కొట్టాడని కోపోద్రికుడైన ఓ వృద్ధుడు యువకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాన్సాస్ నగరానికి చెందిన యువకుడు రాల్ఫ్ యార్ల్(16) ఒక నల్లజాతీయుడు. తన కవల సోదరులను తీసుకువెళ్లడానికి పొరపాటున వేరే ఇంటికి వెళ్లాడు. ఇంటి డోర్ బెల్ ను రెండు సార్లు మోగించాడు. దీంతో శ్వేతజాతీయుడైన ఇంటి యజమాని ఆగ్రహానికి గురై యువకుడిపై విచక్షణా రహితంగా రెండు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడిని ఆండ్రూ లెస్టర్ (85)గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని 24 గంటల కస్టడీ తర్వాత విడుదల చేశారు. దీంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడిని అరెస్టు చేయాలని కాన్సాస్ నగర ప్రజలు అతడి ఇంటి ఎదుట పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ స్పందించారు. బైడెన్ యువకుడితో ఫోన్లో మాట్లాడి అతడి క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.













