ట్రస్ క్యాబినెట్లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. సుయెల్లా బ్రేవర్ మాన్, అలోక్శర్మకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రధాని పదవికి పోటీపడిన తోటి భారతీయుడు రిషి సునాక్‌ను కాదని తనకు మద్దతిచ్చిన సుయెల్లాకు హోం శాఖ కార్యదర్శి బాధ్యతలను ఆమె అప్పగించారు. భారత్ లోని గోవా`తమిళ మూలాలున్న 42 ఏండ్ల బారిస్టర్ అయిన సుయెల్లా కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆగ్రాలో జన్మించిన 55 ఏండ్ల అలోక్శర్మకు కూడా మంత్రి పదవి ఇచ్చారు.













