భవిష్యత్తులో మరో మహమ్మారి… బిల్గేట్స్ హెచ్చరిక
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నప్పటికీ భవిష్యత్తులో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ హెచ్చరించారు. అయితే ఈ కొత్త మహమ్మారి కరోనా వైరస్ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్ల నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నప్పటికీ, ఇటీవల విరివిగా టీకాలు అందుబాటులోకి రావడంతో తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇప్పటికే చాలా మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్ వేరింయట్ను తట్టుకోగలిగామని, అయితే కొవిడ్ తగ్గుతున్నప్పటికీ మరోమహమ్మారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. వృద్ధులు, ఊబకాయలు, డయాబెటిస్ రోగులపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు.













