భారత్ పై బిల్ గేట్స్ ప్రశంసలు
భారత్ పై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. భారత్ ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. భారీ సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని నిరూపించింది. భారత్ పోలియో వ్యాధిని పారద్రోలింది. హెచ్ఐవీ వ్యాప్తికి అడ్డుకట్టవేసింది పేదరికం, శిశుమరణాలను తగ్గించింది. పారిశుధ్యం, ఆర్థికసేవలను అధికశాతం మందికి అందుబాటులోకి తెచ్చిందని భారత్‌ను బిల్గేల్స్ ప్రశంసించారు. పలు సమస్యలను ఏకాలంలో ఎదుర్కోవచ్చని భారత్ రుజువు చేసిందన్నారు. గొప్ప భవిష్యత్తు ఉందన్న ఆశను భారత్ కల్పిస్తోందని వ్యాఖ్యానించారు.













