అమెరికా మిలటరీకి బైడెన్ ఆదేశం…మిలిటెంట్ గ్రూప్ పై
ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకార దాడులు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ మిలటరీని ఆదేశించింది. ఇరాన్ మిలిటెంట్ గ్రూప్ కతియాబ్ హిజ్బుల్లా, అనుబంధ సముహాలు వినియోగించే మూడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఉత్తర ఇరాక్‌లో తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడినట్లు సమాచారం. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సి) ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు. ఇరాన్ మిలిటెంట్ గ్రూప్ కతియాబ్ హిజ్బుల్లా, అనుబంధ సమూహాలు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాయి. జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఇచ్చిన దాడి సమాచారంతో బైడెన్ ఈ దాడితో అప్రమత్తమయ్యారని, పెంటగాస్, అత్యున్నత అధికారులతో సమావేశం నిర్వహించారని సమాచారం.













