జో బైడెన్‌కు షాక్ ఇచ్చిన సౌదీ యువరాజు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ షాక్ ఇచ్చారు. బైడెన్ సౌదీ పర్యటన సందర్భంగా జర్నలిస్టు జమాల్ ఖసోగి హత్య అంశాన్ని బైడెన్ ప్రస్తావించారని, ఇరాక్, పాలస్తీనాల్లో అమెరికా సైనికుల దురాగతాలను లేవనెత్తడంతో బైడెన్ ఏమీ మాట్లాడలేదని సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ తెలిపారు. అయితే, ఖషోగి హత్య గురించి తాను ప్రస్తావించానని, అందులో తన ప్రమేయం లేదని సౌదీ యువరాజు చెప్పారని బైడెన్ తెలిపారు. సౌదీ మంత్రి వెల్లడించిన అంశాల గురించి అమెరికా మీడియా బైడెన్‌ను ప్రశ్నించగా అవి నిజం కాదని ఆయన బదులిచ్చారు.













