ఆటల్లో రాజకీయాలు ఏంటి?.. పాకిస్థాన్ మండిపాటు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ప్రారంభం కానున్న శీతాకాల ఒలింపిక్స్‌ను పలు దేశాలు దౌత్య బహిష్కరణ చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. క్రీడల్లో రాజకీయాలేంటని ప్రశ్నించింది. రాజకీయాలను క్రీడలకు దూరంటా పెట్టాలని హితవు పలికింది. ఇలాంటి చర్యలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి అసీం ఇఫ్తికార్ మీడియాతో మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు ఎలాంటి రూపంలో ఉన్నా పాకిస్థాన్ వాటిని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. దేశాలన్నీ కలిసి రావాలని, బీజింగ్ ఒలింపిక్స్‌లో తమ క్రీడాకారులు పాల్గొనేలా చేసి వారి ప్రతిభాపాటవాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.













