అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పొడిగింపు

ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలను నిషేధం విధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడిరచింది. షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ చేయాల్సిన ఇంటర్నేషనల్ ప్లైట్ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఆల్ కార్గో విమానాలు, ప్రత్యేకంగా అనుమతించిన విమానాలపై ఈ నిషేధం ఉండదని తెలిపింది. కొవిడ్ 19 కారణంగా 2021 నవంబర్ 26న ఇచ్చిన మార్గాదర్శకాలను మారుస్తూ డీజీసీఏ తాజా ఆదేశాలిచ్చింది. అయితే కొన్ని రూట్లలో పరిమితంగా విమాన రాకపోకలకు అనుమతించింది. తాజా ఆదేశాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆప్ ఇండియా (ఏఏఐ) కచ్చితంగా పాటించాలని సూచించింది. అయితే ముందుగా నవంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత డిసెంబర్ 15 వరకు పొడిగించిన విషయం విదితమే.
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి 23న అంతర్జాతీయ విమానాలను నిలిపివేసిన విషయం విదితమ. అనంతరం 28 దేశాల్లో బబూల్ ఆరెంజ్మెంట్స్ ప్రయాణాలకు అనుమతించింది. ప్రస్తుతం 32 దేశాలతో భారత్ బబూల్ ఆరెంజ్ ఉన్నట్టు డీజీసీఏ తెలిపింది.











































































