వైద్యశాస్త్రంలో మరో అద్భుతం….
ఇదో వైద్యశాస్త్ర అద్భుతం. 27 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం ఇప్పుడు ఓ బేబీకి జన్మనిచ్చింది. అమెరికాకు చెందిన టీనా, బెన్ గిబ్బన్ దంపతులకు ఆడ శిశువు పుట్టింది. అక్టోబర్ 26వ తేదీన ఆ పాప పుట్టినట్లు టెన్నిసీసీ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఆ బేబీకి మొల్లి ఎవరెట్ గిబ్బన్ అని పేరు పెట్టారు. 1992లో మెల్లి పిండాన్ని ఫ్రీజ్చేశారు. అయితే 27 ఏళ్ల పాటు శీతలీకరణ దశలో ఉన్న ఆ పిండాన్ని.. కృత్రిమ పద్ధతిలో టీనా గర్భాశయానికి ఎక్కించారు. బేబీ మొల్లి గిబ్బన్ కన్నా ముందు కూడా టీనా దంపతులు ఇదే తరహాలో ఆడ శిశువు జన్మనిచింది. 2017లో పుట్టిన ఆ అమ్మాయి పేరు ఎమ్మా వ్రైన్ గిబ్బన్. అయితే ఎమ్మా కోసం 24 ఏళ్ల క్రితం నాటి పిండాన్ని వినియోగించారు. మొల్లి, ఎమ్మాలు జన్యుపరంగా అక్కాచెళ్లులు అవుతారు. ఈ ఇద్దరి పిండాలను 1992లో డోనేట్ చేశారు. అప్పటి నుంచి ఓకే దగ్గర ఆ పిండాలను ఫ్రీజ్ చేశారు. అదె పిండాలతో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన టీనా.. మెల్లి గిబ్బన్ కన్నా ఒక ఏడాది ముందు జన్మించడం విశేషం.
ఎంబ్రియో అడాప్షన్ విధానం గిబ్బన్ దంపతులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఐవీఎఫ్ చికిత్స చేసుకునే వారు అదనంగా పిండాలను దానం చేయాల్సి ఉంటుంది. అయితే పిల్లలు కాని వారు, ఆ పిండాలను దత్తత తీసుకుంటారు. కానీ అప్పటి వరకు ఆ పిండాలను మైనస్ ఉష్ణోగ్రతల్లో ఫ్రీజ్ చేస్తారు.













