కేన్సర్ ఔషధానికి అమెరికాలో అనుమతి
ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో వినియోగించే లీప్రొలైడ్ అసిటేట్ ఇంజెక్షన్‌ను అరబిందో ఫార్మా అమెరికాలో విడుదల చేయనుంది. దీనికోసం అరబిందో అనుబంధ సంస్థ యూగియా ఫార్మా యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి తీసుకుంది. ఈ ఔషధాన్ని అబ్బీవీ ఎండోక్రైనాలజీ ఇంక్ అనే అమెరికా కంపెనీ లుప్రాన్ బ్రాండుతో విక్రయిస్తోంది. దీనికి బయోఈశ్వలెంట్ ఔషధంగా లీప్రొలైడ్ అసిటేట్‌ను అరబిందో విడుదల చేస్తుంది. ఈ ఔషధం అమెరికాలో 83 మిలియన్ డాలర్ల వార్షిక అమ్మకాలు నమోదు చేస్తోంది. అరబిందోకు ఇది అమెరికాలో ఏఎన్‌డీఏ (అబ్రివియో టెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్) అనుమతి లభించిన 140వ ఔషధం.













