ఏడాదంతా మైనార్టీలపై దాడులే : అమెరికా
భారత్లో గత ఏడాదంతా మైనార్టీలపై దాడులు జరుగుతునే ఉన్నాయని అమెరికా ఆరోపించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో విదేశాంగ శాఖ ఈ విషయాన్ని పేర్కొంది. 2021 సంవత్సరం పొడవునా మైనార్టీల హత్యలు, దాడులు, బెదిరింపులు వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయం ఫాగీ బాటమ్ లో కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని విడుదల చేశారు. వివిధ దేశాల్లోని మత స్వేచ్ఛపై అమెరికా దృక్కోణాన్ని దీంట్లో పొందుపరిచారు. భారతదేశంలోని మైనార్టీల మతస్వేచ్ఛపై ఎలాంటి అభిప్రాయాన్ని ఈ నివేదికలో వెల్లడించలేదు.













