అమెరికా విధించిన ఆంక్షలను.. ఎత్తివేయాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ 74వ సమావేశం జరిగింది. అందులో క్యూబా, వెనిజులా, ఇరాన్ లాంటి దేశాలపై అమెరికా విధించిన ఆంక్షలను కరోనా మహమ్మారి కారణంగా ఎత్తి వేయాలని కోరాయి. ఆంక్షల వల్ల తమ ప్రజలకు అవసరమైన మందులను అందించలేక పోతున్నామని చెప్పారు. ఆంక్షల వలన ఆ దేశాలకు ఇతర దేశాల నుంచి రావాల్సిన మందుల దిగుమతి కావడం లేదు. ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళే మందులు ఉత్పత్తి చేసుకోవాలంటే దొరకటం లేదు. వ్యక్తిగత రక్షణ కిట్స్, వెంటిలేటర్ కొన్ని రకాల ముడి సరుకులు దిగుమతి తప్పనిసరి. అవి అందడం లేదు. ఈ పరిస్థితి చూస్తే సామూహిక శిక్షను తలపిస్తున్నది అంటున్నారు. సమావేశంలో క్యూబా, వెనిజులా ఆరోగ్య శాఖ మంత్రులు మాట్లాడుతూ.. తమను సామూహిక శిక్ష నుంచి బయట పడటానికి ఆంక్షలు ఎత్తివేయడమే ఏకైక మార్గం అని చెప్పారు.