టెక్సాస్ లో విషాదం… మ్యూజిక్ ఫెస్టివల్లో
మ్యూజిక్ ఫెస్టివల్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలో ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఈ ఘటన జరిగింది. స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జనం వేదిక వైపు ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. గుండెపోటుతో 11 మంది హాస్పిటల్‌కు తరలించారు. మరో 8 మంది మృతి చెందారు. సుమారు 300 మంది గాయపడ్డారు. దాదాపు 50 వేల మంది ఆ మ్యూజిక్ ఈవెంట్‌కు హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నట్లు, అక్కడి వీడియో పుటేజీలను పరిశీలిస్తున్నట్లు హ్యూస్టన్ పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో మ్యూజిక్ ఫెస్టివల్‌ను రుద్ద చేశారు.













