అమెరికాలో కాల్పుల కలకలం ..
అమెరికాలో సర్వసాధారణమైన తుపాకీ సంస్కృతి మరో నలుగురిని బలి తీసుకుంది. కొలరాడో వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విచక్షణారహితంగా ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీసు అధికారితో సహా నలుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత అతడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. డెన్వర్, లేక్వుడ్ నగరాల్లో నాలుగు వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. డెన్వర్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు చనిపోగా, ఒక వ్యక్తి గాయపడ్డారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా మరణించాడు. ఆ తర్వాత సాయుధుడు పొరుగునే గల లేక్వుడ్ వెళ్ళి మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఒకరిని గాయపరిచారు. లేక్వుడ్ అధికారులు వెంటనే ఆ వ్యక్తిని గుర్తించారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి, పోలీసులుకు మధ్య కాల్పుల్లో దుండుగుడు చనిపోయాడని లేక్వుడ్ పోలీసు ప్రతినిది జూన్ రొమేరో తెలిపారు. గాయపడిన మరో పోలీసు అధికిరా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి కాల్పులెందుకు జరిపిందీ వెంటనే తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోంది.













