అమెరికాలో హిందూ విద్వేష దాడులు
అమెరికాలో 14 మంది భారత మహిళలపై దాడి చేసిన వ్యక్తిని కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి అతడు ఈ దాడులకు పాల్పడుతున్నాడని వారు పేర్కొన్నారు. ఈస్ట్ పాలో ఆల్టోలో నివసిస్తున్న 37 ఏళ్ల లాథన్ జాన్సన్ను నిందితుడిగా గుర్తించిన అధికారులు, అతడిపై పలు కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. సుమారు 50 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసున్న 14 మంది మహిళలను నిందితుడు లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకూ దాడులు చేశాడు. భారత సంప్రదాయ కట్టు, బొట్టు కలిగిన మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆభరణాలను చోరీ చేస్తున్నాడు.













