భారతీయ విద్యార్థులకు చైనా శుభవార్త
కొవిడ్ వల్ల ఆగిపోయిన చదువులను తిరిగి కొనసాగించేందుకు వీలుగా 1300 మంది భారతీయ విద్యార్థులకు వీసాలను మంజూరు చేసినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది. వీరందరూ సంబంధిత విశ్వవిద్యాలయాలకు హాజరుకావచ్చని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. చైనా వీసాలకు దరఖాస్తు చేసుకునేందు ఆ దేశానికి చెందిన 40 విశ్వవిద్యాలయాలు నిరభ్యంతర పత్రాలు జారీ చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని భారతీయ విద్యార్థులకు సూచించారు. కొవిడ్ తర్వాత ఇప్పటి వరకు 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు చైనా వెళ్లి కళాశాలల్లో తిరిగి చేరినట్లు సమాచారం.













