అంతరిక్షంలో ఒలింపిక్స్…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ టోక్యో ఒలింపిక్స్ అలా ముగిశాయో లేదు.. అంతరిక్ష ఒలింపిక్స్ మీడియోను నాసా షేర్ చేసింది. అదేంటి? ఇవెప్పుడు జరిగాయి? అని ఆశ్చర్యపోకండి. ఇదంతా కొందరు ఆస్ట్రోనాట్ ల ఉత్సాహమే. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో కొందరు వ్యోమగాములు కొన్ని ఆటలు ఆడారట. దీనికి సంబంధించిన వీడియోనే నాసా సోషల్ మీడియాలో పంచుకుంది. మొట్టమొదటి అంతరిక్ష ఒలింపిక్స్ అనే పేరుతో పంచుకున్న ఈ వీడియోలో వ్యోమగాములు, సింక్రొనైజ్డ్ ప్లోటింగ్, జిమ్నాస్టిక్స్ నో-హ్యాండ్ బాల్ వంటి క్రీడలు అడారు. ఈ బృందం రెండు గ్రూపులుగా విడిపోయంది. టీమ్ సోయుజ్, టీమ్ డ్రాగన్ గ్రూపులుగా విడిపోయింది. టీమ్ సోయుజ్, టీమ్ డ్రాగన్ గ్రూపులు టైటిల్ కోసం పోటిపడ్డాయి. ఈ క్రీడల్లో వెయిట్ లెస్ షార్ప్ షూటింగ్ కూడా ఆడారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.













