సీక్రెట్‍గా అరియానా గ్రాండే పెళ్లి…

పాప్ సింగర్ అరియానా గ్రాండే సీక్రెట్‍గా పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలోని తన నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో తన ప్రియుడు ఎస్టేట్ డాల్టన్ గోమేజ్‍ని పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. గతేడాది డిసెంబర్‍లో తన బాయ్‍ఫ్రెండ్ ఎస్టేట్ డాల్టన్‍తో అరియానా గ్రాండే ఎంగేజ్‍మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారంలో వీరి పెళ్లి జరిగినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కేవలం 20 మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ముందే వీరు అమెరికాలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.