ఉక్రెయిన్‌లో ని తెలుగువారి భద్రతకు చర్యలు : ఏపీ ఎన్ఆర్టీఎస్
ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి ఏపీ ఎన్ఆర్టీఎస్ అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆ సంస్థ సీఈవో కే దినేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీఎన్ఆర్టీఎస్ పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఏపీ భవన్ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రావాలనుకునే ప్రవాసాంధ్రులకు సహాయం చేయడానికి ఏపీఎన్ఆర్టీఎస్ అవసరమైన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.













