రష్యా దాడికి దిగితే తగు రీతిలో స్పందిస్తాం : అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్
తమ భూభాగంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకొనేందుకు నాటో సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. బ్రస్సెల్స్‌లో నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో బ్లింకెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా దాడికి దిగితే నాటో తగు రీతిలో స్పందిస్తుందన్నారు. రష్యాతో యుద్దాన్ని తాము కోరుకోవడం లేదని అన్నారు. ఉక్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని వెల్లడిరచారు. నాటో అనేది ఒక రక్షణ కూటమి అని గుర్తు చేశారు. అనంతరం నాటో అధినేత జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ 30 సభ్యదేశాల రక్షణ బాధ్యత తమపై ఉందని అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలో నాటో భాగస్వామి కాదని స్పష్టం చేశారు.













