మెంథాల్ వాడకాన్ని నిషేధిస్తాం : అమెరికా

సిగరెట్లు, చుట్టల్లో మెంథాల్ వాడకాన్ని నిషేధించడానికి ప్రయత్నిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మెంథాల్ వాడకాన్ని నిషేధించడానికి చాలాసార్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‍డిఎ) విభాగం ప్రయత్నించింది. పొగ తాగేవారిలో బాగా పాపులర్ అయిన ఈ మింట్ ప్లేవర్‍ను తొలగించాలని ఆఫ్రికన్ అమెరికన్ గ్రూపుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ హామీ ఇచ్చింది. బడా పొగాకు సంస్థలు, కాంగ్రెస్ సభ్యులు నుంచి వచ్చిన ఒత్తిళ్లకు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తలొగ్గాల్సి వచ్చింది. పొగాకు కంపెనీల నుండి చట్టపరమై సవాళ్లను కూడా ఎదుర్కొవాల్సి రావచ్చు. ఒబామా, ట్రంప్ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీనిపై అంతిమంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గత వేసవిలో పొగ తాగడాన్ని వ్యతిరేకించిన గ్రూపులు, వైద్య బృందాలు పిటిషన్ దాఖలు చేశాయి. దానిపై విచారణ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. యువతలో ముఖ్యంగా నల్ల జాతీయులైన యువతలో తక్కువ ఖరీదుండే, ఈ తరహా చిన్న చుట్టలు, సిగరెట్టు ఎక్కువ ఆదరణ పొందాయి.