రష్యాకు మరోసారి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
రష్యాకు ఉక్రెయిన్ మరోసారి గట్టిషాకిచ్చింది. మాస్కోకు చెందిన భారీ ల్యాండింగ్ నౌక సీజర్ కునికోవ్‌ను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని కీవ్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వెల్లడిరచింది. క్రిమియా జలాల్లో రష్యా నౌకపై దాడి చేశామని తెలిపింది. ఈ నౌకపై మూగురా`వీ5 శ్రేణి సముద్ర డ్రోన్లతో స్పెషల్ ఫోర్స్‌లోని యూనిట్`13 దాడి చేసింది. దాంతో ఆ నౌక నీట మునిగింది. సహాయ కార్యక్రమాల కోసం రష్యా దళాలు హెలికాప్టర్లను ఉపయోగించాయి. అయితే ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియరాలేదు. ఈ ప్రకటనపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సీజర్ కునికోవ్‌ను రష్యా ప్రాజెక్ట్ 775 కింత తయారు చేసింది. ఇది 87 మంది సిబ్బందిని మోసుకెళ్లగలదు. సిరియా, జార్జియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది.













