రష్యాకు ఎదురుదెబ్బ.. ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్
ఉక్రెయిన్ దళాలు రష్యాను గట్టిదెబ్బ కొట్టాయి. ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారిని మట్టుబెట్టాయి. ఇందుకోసం యూకే సరఫరా చేసిన స్ట్రామ్ షాడో క్షిపణిని ఉపయోగించాయి. బెర్డియాన్స్క్ నగరంలో జరిగిన దాడిలో లెఫ్టినెంట్ జనరల్ ఒలేగ్ యూరివిచ్ త్సొకోవ్ మరణించారు. ఈ విషయాన్ని మేరియుపొల్ మేయర్ టెలిగ్రామ్ చానెల్ కూడా ధ్రువీకరించింది. రష్యా ఆక్రమింత ప్రాంతంలోని దున హోటల్ రష్యా సైనిక నాయకత్వంలోని కీలక కమాండర్లు ఉంటున్నారు. ఈ దాడిలో హోటల్ మొత్తం పూర్తిగా నేలమట్టమైంది. ఈ భవనానికి అత్యంత సమీపంలోనే యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నా ఈ దాడి జరగడం విశేషం.













