అమెరికన్ ల ఫ్యామిలీ టైం 4 గంటలే!
కుటుంబంతో గడిపితే ఆదో అనందం. ఎన్ని బాధలున్నా తొలగిపోతాయన్న భావన, కానీ అమెరికన్లకు కుంటుంబంతో గడపడం అంటేనే ముల్లు మీదు కుర్చున్నట్టు అనిపిస్తుందట. తాజాగా సర్వేలో తేలింది విషయం. క్రిస్మస్ సమీపిస్తున్న తరుణంలో టెక్సాస్‌కు చెందిన మాటెల్6 సంస్థ, లండన్‌కు చెందిన వన్‌పోల్ కలిసి సర్వే నిర్వహించాయి. అమెరికన్లు రోజులో అత్యదికంగా 3 గంటల 54 నిమిషాలు కుటుంబానికి కేటాయిస్తే అదే ఎక్కువ అని తేలింది. కుటుంబంతో కలిసి ఉండటం అంటే తీవ్ర ఒత్తిడికి గురవుతామని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తెలిపారు.













