భారత విద్యార్థిపై అమెరికా ఎయిర్‌లైన్స్ నిషేధం
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తోటీ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన భారత విద్యార్థి ఆర్యా వోహ్రా (21) పై ఆ ఎయిర్ లైన్స్ నిషేధం విదించింది. అతడు భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ కి బయలుదేరిన విమానంలో ఆర్యా వోహ్రా మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై యూత్ర విజర్జనకు పాల్పడ్డాడు. అయితే, ఈ ఘటనపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయలేదు. విద్యార్థి భవిష్యత్తు దృష్టా ఫిర్యాదు ఇచ్చేందుకు వెనుకడుగు వేశారు. కానీ విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీనితో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు ఆర్యా వోహ్రాపై నిషేధం విధించినట్లు అమెరికన్ ఎయిర్లైన్స తెలియజేసింది.













