భారతీయ విద్యార్థులకు అమెరికా శుభవార్త
తమ దేశంలో చదువుకోవాలనుకునే భారత విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. విద్యార్తి వీసా (ఎఫ్-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అమెరికాలో విద్యా సంవత్సరం ఇటీవల ప్రారంభం అయింది. వీసాలకు ఒత్తిడి తగ్గటంతో ఇటీవల వీసా తిరస్కారానికి గురైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. రెండు మూడేళ్లలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు వీసాలు మంజూరు చేశారు. కొవిడ్ విజృంభణతో అమెరికా విద్యా సంస్థల్లో సైతం చేరే దేశీ విద్యార్థుల సంఖ్యా తగ్గింది. పరిస్థితులు సద్దుమణగడంతో యూఎస్ వెళ్లేందుకు ఆసక్తి చూపే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈ పరిస్థితిత్లో తొలిసారి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకదఫా విద్యార్థి వీసా తిరస్కారానికి గురైన పక్షంలో ఆ ఏడాదిలో మళ్లీ దరఖాస్తు చేసుకునే విషయంలో పరిమితులు విధించింది. అర్హులైన వారి అవకాశాలకు ఇబ్బదులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.













