భారత్ పై ఆత్మాహుతి దాడులు చేస్తాం
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ప్రవక్త గౌరవాన్ని కాపాడటానికి భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్టు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఈ దాడులకు తెగబడనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రవక్తను అవమానించిన వారిని చంపేస్తాం. మేము, మా పిల్లలు ఒంటిపై బాంబులు ధరించి పేలుళ్లకు పాల్పడుతాం. కాషాయ ఉగ్రవాదుల్లారా. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్లో చావు కోసం ఎదురుచూడండి అని హెచ్చరించింది.













