ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఢిల్లీ-మస్కో మధ్య
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-మాస్కో మధ్య నడిచే ఎయిరిండియా విమానాలను తాత్కాలికంగా రద్దు చేసింది. యుద్ధం దృష్ట్యా బీమా సమ్యలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-మాస్కో మధ్య వారంలో రెండుసార్లు ఎయిరిండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అయితే వీటిని తాజాగా రద్దు చేశారని రష్యన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. విమాన టికెట్ల విక్రయాలను భారత్‌కు చెందిన ఎయిరిండియా నిలిపివేసింది. ఈ మార్గంలో సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ మార్గంలో ఎయిరిండియా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నగదు రీఫండ్‌ను చేయనున్నారు అని ఎంబసీ తెలిపింది.













