ఈ సమయంలో భారత్ తో చర్చలు వద్దు
భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కశ్మీర్ మాత్రమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ తో పాక్ సంబంధాలు బలపడాలని, అయితే, అందుకు టీ20 వరల్డ్ కప్ లో భారత్‌పై తమ జట్టు గెలిచిన ఈ తరుణం సరైంది కాదని అన్నారు. ఇలాంటి టైంలో అసలు ఆ ఊసు కూడా ఎత్తకూడదన్నారు. ఆ సమస్యను హుందాగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో నిర్వహించిన పాకిస్థాన్ సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడారు. చైనాతో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్‌తో కూడా సంబంధాలు బలపడితే భారత్, పాక్ రెండూ శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతాయని తెలిపారు. కశ్మీర్ ప్రజలకు 72 ఏళ్ల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కల్పించిన హక్కుల అమలు గురించే తమ ఆందోళనంతా అని అన్నారు. వారికి ఆ హక్కులిస్తే తమకు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు.













