అమెరికా తీరుకు నిరసనగా.. మెగసెసె అవార్డును వెనక్కి
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మెగసెసె అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండె వెల్లడించారు. 2002లో ఆయనకు ఈ అవార్డుకు వచ్చింది. అమెరికాలో తాను సంపాదించిన రెండు మాస్టర్స్ డిగ్రీలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు పాండే తెలిపారు. మెగసెసె అవార్డులను రాక్ఫెల్లర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోందని, తనకు వచ్చిన అవార్డు కేటగిరీకి ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయం చేసిందని వెల్లడించారు. ఇవి రెండూ అమెరికా కంపెనీలని, అందుకే అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నానని తెలిపారు.













