టెక్సాస్ లో భారీ ప్రమాదం
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ప్రమాదం జరిగింది. డిమ్మిట్‌లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించి దాదాపు 18,000 ఆవులు మృత్యువాతపడ్డాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళ తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా, డెయిరీ ఫాంలోని యంత్రాలు భాగా వేడెక్కడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్క సారిగా మీథేన్ అధిక మొత్తంలో విడుదలైందని అందుకే ఆవులు మృతి చెంది ఉంటాయని చెబుతున్నారు. అయితే, ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలో సాధారంగానే మీథేన్ వాయువు వెలువడుతుంది. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దాని ద్వారా మీథేన్ బయటికి వస్తుంది.













