30 ఏళ్ల విరామం తర్వాత కదిలింది… ప్రపంచంలోనే అతిపెద్ద
దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఏ-23ఎ 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదలింది. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా ఎ-23ఎ ఏర్పడింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. దాని విస్తీర్ణం 4 వేల చదరపు కిలోమీటర్లు. దుబాయ్ విస్తీర్ణం 4,114 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం మంచుఫలకం ఎట్టకేలకు సాగర అడుగు భాగం నుంచి వేరుపడి వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచుఫలకాలకు భిన్నంగా ఎ`23ఎ తన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు పేర్కొన్నారు.













