భారతీయులపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత దేశంపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారని అన్నారు. నవంబరు 4న రష్యన్ యూనిటీ డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. 100 కోట్లకు పైబడిన జనాభాగల భారత దేశ సత్తా పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మనం భారతదేశాన్ని చుద్దాం. అంతర్గత అభివృద్ధి కోసం విజయకాంక్షగల గొప్ప ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. ఆ దేశాభివృద్ధిలో కచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి. సందేహాలేవీ అక్కర్లేదు. దాదాపు 150 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు ఇప్పుడు అదే సత్తా అని తెలిపారు.













