ఫిట్స్బర్గ్లో కాల్పుల కలకలం
అమెరికాలోని ఫిట్స్బర్గ్లో ఓ ఇంట్లో విందు వికటించి కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు బాలురు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు ఓ ప్రకటన వెలువరించారు. ఏదో పంక్షన్తో ఇంట్లో విందు తెల్లవారిదాకా సాగింది. కారణం తెలియదు అయితే ఇంటిలోపల ఉన్నట్లుండి 50 రౌండ్ల మేరకు కాల్పుల జరిగాయి. కొన్ని తూటాలను బయటకు కూడా కాల్చారు. ఈ ప్రాంతం అంతా తూటాలతో దెబ్బతిన్న గోడలు, నెత్తుటి మరకలతో కన్పించింది. ఈ ప్రాంతంలోని పలు బ్లాక్‌లలో ఘటన గురించి స్థానిక పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఇంతవరకూ అక్కడి అధికారులు అనుమానితుల ఫోటోలు ఏవీ కూడా విడుదల చేయలేదు.













